Breaking News

ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి

Published on Mon, 02/10/2025 - 18:14

ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్‌తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్‌లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్‌లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్‌ను శివరాజ్‌కుమార్ లాంటి స్టార్‌ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్‌లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)