Breaking News

క్యాన్సర్‌తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి

Published on Sun, 07/07/2024 - 10:52

బుల్లితెర నటి హీనా ఖాన్‌ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. కానీ కూతురికి క్యాన్సర్‌ రావడాన్ని తట్టుకోలేని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్‌కు ప్రస్తుతం క్యాన్సర్‌ మూడో స్టేజీలో ఉంది. దీంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. కీమోథెరపీ చేశారు. ఇందుకోసం జుట్టు కత్తిరించారు.

శరీరంపై గాయాలు
ఫస్ట్‌ కీమోథెరపీ అయిపోయిందంటూ నటి సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేసింది. అందులో హీనా చేతి కింద, మెడపైన కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఈ ఫోటోలో మీకు నా శరీరంపై ఉన్న మచ్చలు కనిపిస్తున్నాయా? లేదా నా కళ్లలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఈ కాలిన మచ్చలను చూసి నేనేం బాధపడటం లేదు. 

నువ్వు ఒక ఫైటర్‌
ఎందుకంటే చికిత్స విజయవంతంగా ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనం. నా కళ్ల ద్వారా విజయకాంతిరేఖలను చూడగలుగుతున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వొక ఫైటర్‌వి.. జాగ్రత్తగా ఉండు హీనా అని కామెంట్లు చేస్తున్నారు.

కెరీర్‌..
కాగా హీనా ఖాన్‌.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో ఫేమస్‌ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ అలరించింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలోనూ మెప్పించింది.

 

 

చదవండి: ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)