సస్పెన్స్‌కు బ్రేక్‌.. పుట్టింది బాబే! పేరేంటో తెలుసా?

Published on Sat, 11/15/2025 - 13:28

బుల్లితెర నటి అంజలి పవన్‌ రెండో బిడ్డకు జన్మనిచ్చి కొన్ని వారాలవుతోంది. కానీ, ఇంతవరకు పుట్టింది ఆడ? మగ? అని వెల్లడించలేదు. అలాగే బేబీ ఫోటోను, పేరును బయటపెట్టకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ నవంబర్‌ 14న బాలల దినోత్సవం నాడు ప్రిన్స్‌ వచ్చేశాడంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో తన కుమారుడి పేరు "జైవీర్‌ క్రితిక్‌ (జేవీకే)" అని వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

సీరియల్స్‌తో ఫేమస్‌
అంజలి.. మొగలిరేకులు, రాధా కల్యాణం, దేవత, శివరంజని వంటి పలు సీరియల్స్‌లో నటించింది. లెజెండ్‌, ఒక లైలా చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది. అంజలి 2017లో నటుడు సంతోష్‌ పవన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు చందమామ (ధన్వి) పుట్టింది. తను కూడా పలు షోలలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చందమామతో ఆడుకునేందుకు ఓ తమ్ముడు కూడా వచ్చేశాడు.

బిగ్‌బాస్‌ ఆఫర్‌
బిగ్‌బాస్‌ షోకు రమ్మని గత కొన్నేళ్లుగా అంజలి పవన్‌కు పిలుపు వస్తూనే ఉంది. ఎనిమిదో సీజన్‌కు వెళ్దామన్న ఆలోచన కూడా అంజలికి వచ్చింది. ఇందుకోసం అంతా సిద్ధం చేసుకుంది. కానీ సరిగ్గా షో మొదలయ్యే సమయానికి పాప ధన్వికి, భర్త పవన్‌కు చికెన్‌ గున్యా, టైఫాయిడ్‌ అని తేలింది. దీంతో బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న ఆలోచన విరమించుకుంది. ఇక తొమ్మిదో సీజన్‌ సమయానికి ఆమె నిండు గర్భిణి కావడంతో ఈసారి కూడా ఆఫర్‌ రిజెక్ట్‌ చేసింది. మరి భవిష్యత్తులో షోలో కనిపిస్తుందేమో చూడాలి!

 

 

చదవండి: 6 ఏళ్లుగా నటుడిని టార్చర్‌ చేస్తున్న మహిళ

Videos

ibomma : ఇమ్మడి రవికి 14 రోజులు రిమాండ్

పద్దతిగా మాట్లాడు.. లేదంటే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వార్నింగ్

Ding Dong: బాబు దెబ్బకు డాక్టర్లు అంటేనే వణికిపోతున్నారు

మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ

ఆ పార్టీలోకి వంగవీటి రంగా కూతురు. పొలిటికల్ ఎంట్రీ

Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్

ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్

Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు

Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి

Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)