Breaking News

25 రోజులు మిస్సింగ్‌.. నటుడిని గుర్తుపట్టని తల్లి!

Published on Fri, 07/12/2024 - 11:18

బుల్లితెర నటుడు గురుచరణ్‌ సింగ్‌ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్‌ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్‌ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.

చూడగానే గుర్తుపట్టలేదు
ఇంటికి వెళ్లాక తన పేరెంట్స్‌ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్‌ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది. 

సంతోషంతో ఏడ్చేశాం
ముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‍కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్‌.. తారక్‌ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)