Breaking News

OTT: మమ్ముట్టి ‘టర్బో’ రివ్యూ

Published on Sun, 08/18/2024 - 00:44

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో  సీరియస్‌ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. దీనికి దర్శకులు వైశాఖ్‌. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా కనిపించారు. టర్బో జోస్‌ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్‌కి మంచి ఆప్తుడు జెర్రీ. 

జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్‌ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్‌ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్‌తో టర్బో జోస్‌ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్‌ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్‌ను జోస్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్‌ ఓటీటీæ తెరమీదే చూడాలి. 

 టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్‌ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్‌తో జోస్‌ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్‌ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్‌ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్‌ పాత్రలో రాజ్‌ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్‌ కథను సరదా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్‌కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’.   
– ఇంటూరి హరికృష్ణ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)