Breaking News

ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్

Published on Sat, 08/31/2024 - 19:26

రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం చాలా ఫేమస్. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పటికే చూశాం కదా అని అనుకోకుండా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో మురారి, ఇంద్ర, మాస్.. ఇలా ఓ రేంజులో అలరించాయి. ఇప్పటివరకు అన్నీ మాస్ మూవీస్ వచ్చాయి కానీ ఈ ట్రెండ్‌లోనే తొలిసారి ఓ హారర్ మూవీ రిలీజ్ కాబోతుంది.

(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)

హారర్ జానర్‌లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. రెగ్యులర్ హారర్ టైపు స్టోరీ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అయితే నిర్మాతలకు డబ్బుల్లేక 2012 నుంచి దాదాపు ఆరేళ్ల పాటు విడతల వారీగా షూటింగ్ చేశారు. ఫైనల్‌గా 2018లో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో అది కూడా లాక్ డౌన్‌లో ఈ సినిమాని తెగ చూశారు. ఇప్పుడు దీన్నే సెప్టెంబరు 13న మళ్లీ దేశంలో పలుచోట్ల రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

'తుంబాడ్' విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామం. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తుంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని, దాని కోసం వెతుకుతుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అత్యాశ అనే స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తాయి. థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే ఈ మూవీ మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.

(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)