Breaking News

కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్‌ అని!

Published on Thu, 08/03/2023 - 20:53

కోకాపేట ఆంటీ గుర్తుందా? పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని తను చాలా రిచ్‌ అని చెప్పకనే చెప్తుండేది. తులసి సినిమా చూసిన అందరికీ ఆమె ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కోకాపేట ఆంటీ పాత్రను ఝాన్సీ పోషించింది. ఈ మూవీలోని ఓ డైలాగ్‌లో ఆమె మాట్లాడుతూ.. 'కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడ పెట్టుకోవాలో తెలీనంత డబ్బు వచ్చింది. అందులకేంచి పది లక్షలు తీసి ఈ కోక, నగలన్నీ కొన్నడు మా ఆయన' అని చెప్తుంది. ఇప్పుడీ డైలాగ్‌ మరోసారి వైరలవుతుంది.

ఎకరానికి వంద కోట్లు
కారణం.. కోకాపేటలో పెరిగిన భూమి ధరలు. హైదరాబాద్‌ శివారులో ఉన్న కోకాపేటలో భూముల ధర ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టిస్తున్నాయి. ఎకరం ఏకంగా వంద కోట్లు దాటింది. అయితే కోకాపేట అంటే ఎప్పటినుంచో రిచ్‌ అంటూ తులసి సినిమాలోని ఝాన్సీ వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. 'కోకాపేట ఆంటీ చెప్పిందంటే అది నిజమే మరి', 'కోకాపేట అంటే మామూలుగా ఉండదు' అని కామెంట్లు చేస్తున్నారు.

కోకాపేటలో రికార్డు ధరలు
కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి. నిధుల సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ గురువారం నాడు మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. నియోపోలీస్‌ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు  గురువారం వేలం వేసింది. ప్లాట్‌ నెంబర్‌ 10లో  3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.25 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు.

చదవండి:  బుల్లితెర నటి ఇంట తీవ్ర విషాదం.. పెళ్లయిన ఏడాదికే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)