తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ
Published on Mon, 09/05/2022 - 20:29
యూపీ చెందిన నటి అర్చన గౌతమ్ తిరుమల కొండపై నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం తిరుపతి దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలోనే రూ.10,500 పెట్టి టికెట్ కొన్న కూడా టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వాలేదని ఆరోపించింది. కౌంటర్‌కి వెళ్లి అడగ్గా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’
అయితే తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విటర్ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తు ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు.
చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీ శివకాంత్ తివారి, నటి అర్చనా గౌతమ్‌తోపాటు మరో ఏడుగురికి ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. (2/n)
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 5, 2022
Tags : 1