Breaking News

దేవుడి అవతారంలో ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ స్టోరీ ఇదేనా?

Published on Thu, 06/12/2025 - 11:53

ఎన్టీఆర్‌,త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్‌(Allu Arjun)తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే మొన్నటివరకు ఇది రూమర్‌గానే ఉండే..కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది.  మైథలాజికల్‌ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుందట. 

‘‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గాడ్‌ పాత్రలో నా మోస్ట్‌ ఫేవరెట్‌ అన్న నటించనున్నారు. గాడ్‌ ఆఫ్‌ వార్‌ ఈజ్‌ కమింగ్‌’’ అని నాగవంశీ ట్వీట్‌ చేశాడు.దాంతో ఎన్టీఆర్‌ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్‌ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. తొలిసారి ఆయన పూర్తిస్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గాడ్‌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్‌ నటించబోతున్నట్లు సమాచారం. 

పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూశాం. అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక త్రివిక్రమ్‌ సినిమాలో దేవుడు పాత్ర చేయబోతున్నాడు. అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. కచ్చితంగా ఎన్టీఆర్‌ అదరగొడతాడు. అందులో నో డౌట్‌. తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఇక ఎన్టీఆర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వార్‌ 2 సినిమా డబ్బింగ్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ సినిమాలో హృతిక్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించగా, కియారా అద్వానీ కీలక పాత్ర పోషించింది. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదల కానుంది. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు