Breaking News

మహేశ్‌తో కాలేజ్‌ డేస్‌ నుంచే పరిచయం : త్రిష

Published on Fri, 09/20/2024 - 09:09

‘‘మహేశ్‌బాబు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కళాశాల రోజుల్లో చెన్నైలో ఉన్నాం’’ అన్నారు హీరోయిన్‌ త్రిష. మహేశ్‌బాబు, త్రిష కలిసి ‘అతడు’ (2005), ‘సైనికుడు’ (2006) వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకి.. ‘మహేశ్‌బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది. 

(చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)

ఇందుకు త్రిష బదులిస్తూ– ‘‘నాకు ఇష్టమైన నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తోటి నటులను చాలా గౌరవిస్తారు. సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తారు. తన షూటింగ్‌ అయిపోయినా కేరవ్యాన్‌లోకి వెళ్లకుండా మానిటర్‌ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటారు. 

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేశ్‌ చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కాలేజ్‌ డేస్‌లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికీ మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారు. వారి వల్ల మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్‌ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అన్నారు త్రిష. ఇదిలా ఉంటే త్రిష నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు త్రిష. ‘స్టాలిన్‌’ (2006) సినిమా తర్వాత చిరంజీవి– త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)