ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష

Published on Sun, 11/19/2023 - 08:18

లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. స్టార్‌ హీరోయిన్‌ త్రిషను ఉద్దేశించి అలా మాట్లాడటంపై కోలీవుడ్ సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండి చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

త్రిష ట్వీట్‌లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను ఖండించారు. 

లోకేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్‌లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి.  ' అని పోస్ట్ చేశారు. కాగా.. లియో చిత్రంలో ఖాన్ మరణశిక్ష విధించబడిన దోషి పాత్రలో కనిపించారు. 

తమన్నా సాంగ్‌పై మన్సూర్ కామెంట్స్

అయితే గతంలో జైలర్‌ సినిమాలోని కావాలయ్యా.. అనే పాటపై లియో నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్‌, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్‌ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ విమర్శలు చేశారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)