చాలా మిస్‌ అవుతున్నాను.. త్రిష ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Sun, 07/12/2026 - 12:09

ప్రముఖ గాయని ఎస్‌.జానకి(88) మరణంతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల  నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్న తరుణంలో, ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సందేశం అభిమానులను ఎంతగానో కదిలిస్తోంది. తన బ్లాక్‌బస్టర్ చిత్రం '96' షూటింగ్ సమయంలో ఎస్. జానకితో కలిసి దిగిన అరుదైన ఫోటోని త్రిష ఈ సందర్భంగా పంచుకున్నారు.

జానకమ్మను స్మరిస్తూ ఎమోషనల్ పోస్ట్
సోషల్‌ మీడియా వేదికగా జనకమ్మకు నివాళులులర్పించారు త్రిష.  ‘నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకదానికి మీ పేరు (జాను) పెట్టడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. మీతో వ్యక్తిగత పరిచయం ఏర్పడటం, మీ అమూల్యమైన ప్రేమను పొందడం నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. మీ ఆప్యాయత, దయ, మరువలేని చిరునవ్వుకు ధన్యవాదాలు. ఎంతటి గొప్ప కళాకారులైనా ఎంత వినయంగా ఉండాలో మీరే నిరూపించారు. మీ గాత్రం అమరమైనది, అది ఎప్పటికీ మన మధ్యే ఉంటుంది. జానకి అమ్మా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ..ఆమెతో కలిసి దిగిన ఫోటోలని షేర్‌ చేసింది.

'96' సినిమాలో జానకమ్మ
చాలా మంది అభిమానులకు తెలియని విషయం ఏమిటంటే, విజయ్ సేతుపతి, త్రిష నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ '96' చిత్రంలో ఎస్. జానకి ఒక ప్రత్యేకమైన సీన్‌లో నటించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమెపై ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ, చిత్ర నిడివి ఎక్కువైపోవడంతో ఆ సీన్‌ను ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డిలీటెడ్ సీన్ ఇంటర్నెట్‌లో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)