Breaking News

యానిమల్ మూవీ నటి.. నక్క తోక తొక్కినట్టుందే!

Published on Wed, 12/06/2023 - 18:24

రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సూపర్ హిట్ డైరెక్టర్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు సందీప్. దీంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే యానిమల్ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ భామ రెబల్ స్టార్‌తో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యానిమల్ చిత్రం ద్వారా రష్మిక కంటే ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రికే పాపులారిటీ దక్కింది. రణ్‌బీర్ కపూర్‌తో ఫుల్ రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. అంతే రణ్‌బీర్‌తో కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మరో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 

యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి డిమ్రిపైనే ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఆమె ఫర్ఫామెన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో సందీప్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంలో ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్పిరిట్‌లో ఆమె పాత్రపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హీరోయిన్‌గా లేదా యానిమల్‌ చిత్రంలానే అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.    

కాగా.. దాదాపు రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో స్పిరిట్ తెరకెక్కించునున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)