Breaking News

అందుకే చెప్పుతో కొట్టుకున్న.. క్షమించండి: దర్శకుడు

Published on Wed, 09/03/2025 - 13:17

టాలీవుడ్‌ సినిమా 'త్రిబాణధారి బార్బరిక్‌' విడుదల తర్వాత ఈ టైటిల్‌ బాగా వైరల్‌ అయింది. అందుకు ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు మోహన్‌ శ్రీవత్స అని చెప్పవచ్చు. సినిమా విడుదల తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మంచి సినిమా తీసినా సరే తనకు సపోర్టుగా ఎవరూ నిలబడలేదని ఆయన బాధ పడ్డారు. చాలా కష్టపడినప్పటికీ తగిన ఫలితం దక్కలేదంటూ చెప్పుతో కొట్టుకుని అందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. అయితే, తాజాగా ఆయన మరో వీడియోతో క్లారిటీ ఇచ్చారు.

'త్రిబాణధారి బార్బరిక్‌' సినిమా కోసం తన కుటుంబాన్ని కూడా బాధ పెట్టానని దర్శకుడు శ్రీవత్స చెప్పారు. ఆపై భావోద్వేగానికి గురై సినీ ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టానని ఆయన చింతించారు. ఈ సినిమా నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చునని తెలిపారు. ప్రేక్షకులు ఏదైనా కొత్తగా ఆలోచించాలనే ఈ సినిమాను తెరకెక్కించాను. మలయాళ సినిమాకు దక్కిన ఆదరణ కూడా తన మూవీకి దక్కకపోయేసరికి జీర్ణించుకోలేకపోయానన్నారు. ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడకపోవడంతో అలా చెప్పుతో కొట్టుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.

సినిమా రిజల్ట్‌‌ చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చేశారని శ్రీవత్స అన్నారు. దీంతో తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నటుడు నరేశ్ కూడా బాధ పడ్డారని గుర్తుచేసుకున్నారు. అయితే, వీడియో వైరల్‌ అయ్యాక ‌ఇతర దేశాల్లో సినిమా చూసిన వారు తనకు మెసేజ్‌ చేశారని వాటిని పంచుకున్నారు. సినిమా బాగుందని మెచ్చుకోవడంతో కాస్త సంతోషాన్నిచ్చింది. కానీ, ఇక్కడ కనీసం సినిమా బాగుంది, బాగాలేదు అని కూడా చెప్పడం లేదన్నారు. అందుకే ఎమోషనల్‌ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసి తప్పులు చెబితే మరోసారి జరగకుండా చూసుకుంటాను కదా అని కోరారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)