హాలీవుడ్‌ యాక్షన్

Published on Tue, 08/26/2025 - 00:08

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌–అప్స్‌’. ఈ ద్విభాషా(ఇంగ్లిష్, కన్నడ) చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ నిర్మిస్తున్నారు. ‘జాన్‌ విక్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’, ‘డే షిఫ్ట్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలకు పని చేసిన యాక్షన్  కొరియోగ్రాఫర్‌ జేజే పెర్రీ ‘టాక్సిక్‌’ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు.

తన హాలీవుడ్‌ స్టంట్‌ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్  సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ‘టాక్సిక్‌’ కోసం 45రోజుల సుదీర్ఘమైన యాక్షన్  షూటింగ్‌ షెడ్యూల్‌ను ముంబైలో ప్లాన్  చేశారు మేకర్స్‌. ఈ షెడ్యూల్‌లో పెర్రీ తన రెగ్యులర్‌ స్టంట్‌ టీమ్‌ని పక్కన పెట్టి, ఇండియన్  స్టంట్‌ టీమ్‌తో వర్క్‌ చేయనుండటం విశేషం.

ఈ అంశంపై జేజే పెర్రీ మాట్లాడుతూ–‘‘నా 35 ఏళ్ల కెరీర్‌లో 39 దేశాల్లో పని చేశాను. భారతీయ సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పది. మా అమెరికన్‌ కల్చర్‌ కొన్ని వందల ఏళ్ల క్రితంనాటిదే. భారతీయ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. ఇండియన్  స్టంట్‌ టీమ్‌ వరల్డ్‌ క్లాస్‌గా ఉంది. ‘టాక్సిక్‌’ కొత్త షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)