ఆ సినిమా నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో

Published on Tue, 03/31/2026 - 18:40

తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇందులో మలయాళ హీరో టొవినో థామస్.. విలన్‌గా నటిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఇప్పుడు టొవినో హీరోగా నటించిన 'పల్లి చట్టంబి' మూవీ తెలుగులోనూ విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తారక్-నీల్ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')

'తెలుగ చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మలయాళ వర్కింగ్ కల్చర్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో భిన్నంగా ఉంటుంది. మేం తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తిచేసేస్తాం. తెలుగులో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టముండదు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తుంటా. ఒకవేళ తెలుగులో పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒప్పుకొన్నా మూడు-నాలుగు మలయాళ చిత్రాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా. డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ మూవీ(ఎన్టీఆర్-నీల్) చేయట్లేదు' అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.

కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా చాలా సినిమాలు చేసిన టొవినో థామస్.. గత పదేళ్లుగా మాత్రం హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మిన్నల్ మురళి, 2018 తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇతడు పరిచితమే. అలాంటిది ఇప్పుడు ఇతడు, ఎన్టీఆర్-నీల్ మూవీలో లేడని తెలిసింది. మరి ఇతడి బదులు వేరే ఎవరిని తీసుకున్నారో చూడాలి?

(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)