Breaking News

ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్‌ చేస్తా: టొవినో థామస్‌

Published on Sat, 05/27/2023 - 16:26

‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.  ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్‌ అన్నారు. టొవినో థామస్‌ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్‌ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది.

(చదవండి: 2018 మూవీ రివ్యూ)

ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్‌ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు. 

‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ  ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)