Breaking News

'టూరిస్ట్‌ ఫ్యామిలీ'లో లిటిల్‌ ఎమర్జింగ్‌ స్టార్‌ గురించి తెలుసా..?

Published on Mon, 05/12/2025 - 13:58

కోలీవుడ్‌లో ఇ‍ప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్‌ జీవింత్‌ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్‌ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్‌ జగన్‌ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్‌ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్‌ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్‌ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్‌ కూడా ఈ చిత్రం సూపర్‌ అంటూ తెలిపారు.

‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్‌, సిమ్రన్‌ల కుమారుడి పాత్రలో కమలేష్‌ నటించాడు. ఇందులో విజయ్‌ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్‌ నటుడు కాదు.. ఒక సింగర్‌. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా   త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్‌ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్‌కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్‌ దక్కింది.

జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్‌ నటించాడు. ఇందులో ఒక స్కూల్‌ టీచర్‌ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్‌ స్టూడెంట్‌గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్‌ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్నాడు.  విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్‌ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్‌ కొట్టేశాడు.

'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'
రాచ్చసి సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్‌ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్‌ సెట్స్‌లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి  ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్‌ కూడా సెట్స్‌కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్‌ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్‌ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)