Breaking News

ఈ ఏడాది టాప్‌- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి

Published on Sat, 12/06/2025 - 11:56

2025లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఇండియన్‌ సినిమాల లిస్ట్‌ వచ్చేసింది. ఈ ఏడాదిలో భారత సినిమాల గురించి గూగుల్‌లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది వెతికేశారు. ఈ లిస్ట్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు ఉన్నాయి. అభిమానుల అభిరుచి మేరకు పలురకాల సినిమాల వివరాల కోసం తెగ వెతికారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా గూగుల్‌లో సర్చ్‌ చేసిన టాప్- 10 లిస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

2025లో చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ మధ్య విడుదలైన సినిమాల్లో ప్రేక్షకులు ఎక్కువగా సర్చ్‌ చేసిన లిస్ట్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో సైయారా చిత్రం మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నటించిన అహాన్‌ పాండే, అనీత్‌ పడ్డా ఇద్దరూ కొత్తవారే కావడం విశేషం.  ఈ జాబితాలో ఉన్న టాప్‌- 10 సినిమాలేమిటంటే..

  1. సైయారా ( హిందీ)

  2. కాంతార- 2 (కన్నడ)

  3. కూలీ (తమిళ్‌)

  4. వార్‌- 2 (హిందీ)

  5. సనమ్ తేరీ కసమ్ (హిందీ)

  6. మార్కో (మలయాళం)

  7. హౌస్‌ఫుల్‌-5 (హిందీ)

  8.  గేమ్ ఛేంజర్ (తెలుగు)

  9. మిసెస్ (హిందీ)

 10 మహావతార్ నరసింహ (కన్నడ, హిందీ)

తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ మాత్రమే
రామ్‌ చరణ్‌- దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గేమ్‌ ఛేంజర్‌. నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ నేరుగా తెలుగులో చేసిన సినిమా కావడంతో అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, గూగుల్‌ ట్రెండ్‌లో మాత్రం ఈ మూవీ టాప్‌లో నిలిచింది. రామ్‌ చరణ్‌, శంకర్‌, దిల్‌ రాజు కామెంట్స్‌తో పాటు కలెక్షన్స్‌ వంటి విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువమంది గూగుల్‌లో సర్చ్‌ చేశారు. అలా టాలీవుడ్‌ నుంచి ఈ లిస్ట్‌లో చోటు సంపాధించుకున్న ఏకైక చిత్రంగా గేమ్‌ ఛేంజర్‌ నిలిచింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)