Breaking News

భావోద్వేగాల హుషారు పిట్టలు

Published on Fri, 07/17/2026 - 03:39

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్‌ సమర్పణలో వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నాయి. చరణ్‌ అర్జున్  సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘టోంగా టోంగా...’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ పాటకు ఎస్‌.ఎస్‌. చిరంజన్‌ సాహిత్యం అందించగా మంగ్లీ పాడారు. మోయిన్  కొరియోగ్రఫీ అందించారు. ఈ వేడుకకి అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి ఇంప్రెస్‌ అయ్యాను. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఇందులో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు.

బిక్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ విడుదల తర్వాత సోషల్‌ మీడియాలో నన్ను ట్రోల్‌ చేస్తూ తిట్టారు. అయితే సినిమా చూసిన తర్వాత నెగెటివ్‌ కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఏషియన్‌ సురేష్‌ ప్రోడక్షన్స్, బెక్కెం వేణుగోపాల్‌గారి సహకారంతో మా సినిమాకి మరింత బలం చేకూరింది’’ అని వాసవి గణేషన్‌ తెలిపారు. చరణ్‌ అర్జున్, నటులు గోవర్థన్, నవీన్, అంజి, కెమెరామేన్‌ రుద్రసాయి, రచయిత ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)