Breaking News

పారితోషికం 10 కోట్లు.. బడ్జెట్‌ 25 కోట్లు.. యంగ్‌ హీరో కండిషన్‌!

Published on Sun, 03/16/2025 - 13:15

సినిమా బడ్జెట్‌ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న సినిమా అయినా సరే ఐదారు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక కొంచెం పేరున్న నటీనటులతో సినిమా చేయాలంటే పది కొట్లకు పైనే అవుతుంది. ఒక్క హిట్‌ పడితే చాలు.. ఆ హీరోలో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండాల్సిందేనట. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. చాలా మంది హీరోలు కథలు వినడం కంటే ముందే.. తన రెమ్యునరేషన్‌, సినిమా బడ్జెట్‌ ఎంతో చెప్పమని అడుగుతున్నారట. తక్కువ బడ్జెట్‌ సినిమాలు చేయమని ముఖంపైనే చెప్పేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్‌ హీరో అయితే తనతో సినిమా చేయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టాల్సిందేనని కండీషన్‌ పెట్టాడట.

తాజాగా ఓ యంగ్‌ డైరెక్టర్‌, నిర్మాత మంచి కాన్సెప్ట్‌తో సదరు హీరోని సంప్రదించారట. కథ మొత్తం విన్నాక.. బడ్జెట్‌ ఎంత అని అడిగాడట. 10-15 కోట్లతో తీయ్యొచ్చని చెబితే..మినిమం 25 కోట్ల బడ్జెట్‌ పెడితేనే సినిమా చేస్తానని చెప్పాడట. తన రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వమని డిమాండ్‌ చేశారట. 

అయితే ఆ హీరోకి ఇటీవల ఒక్క హిట్‌ కూడా లేకపోవడం గమనార్హం. పైగా ఆయన నటించిన ఓ హిందీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయినా కూడా తన రెమ్యునరేషన్‌ని ఏమాత్రం తగ్గించలేదట. ఆ హీరో మార్కెట్‌ వ్యాల్యూ కూడా అంతగా లేదు. దీంతో సదరు నిర్మాత అంత బడ్జెట్‌ పెట్టలేనని చెప్పి బయటకు వచ్చాడట. వరుసగా ఫ్లాపులు వచ్చాయి కదా..తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటాడని ఆ హీరోని సంప్రదిస్తే.. ఆయన పెట్టిన కండీషన్‌ చూసి సదరు నిర్మాత షాకయ్యారట. ఇలా చాలా మంది యంగ్‌ హీరోలు ఒక్క హిట్‌ పడగానే రెమ్యునరేషన్‌ పెంచడంతో పాటు భారీ బడ్జెట్‌ సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)