Breaking News

టాలీవుడ్ యంగ్ హీరో సూపర్‌ హిట్‌ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్!

Published on Sun, 03/17/2024 - 15:51

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 

ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్‌ సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ - చందు కాంబోలో మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్‌ వినిపిస్తోంది. 

కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్‌ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు