Breaking News

దిల్‌ రాజు ఇంట వేడుకలు.. యంగ్‌ హీరో నిశ్చితార్థం..

Published on Fri, 12/01/2023 - 08:53

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఎంతోమంది బ్యాచిలర్‌ లైఫ్‌కు స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఇదే మంచి సమయం అనుకుని మూడుముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా వెంకటేశ్‌ రెండో కూతురు నిశ్చితార్థం జరిగింది. తాజాగా దిల్‌ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రౌడీ బాయ్స్‌ హీరో ఆశిష్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ ఎంగేజ్‌మెంట్‌ గురువారం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వేలికి ఉంగరం తొడిగాడు ఆశిష్‌. ఈ నిశ్చితార్థ వేడుకను గోప్యంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే రౌడీ బాయ్స్‌ సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్‌.

ఈ సినిమాలో కుర్రకారు ఫేవరెట్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజైంది. తర్వాత విశాల్‌ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్‌ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో లవ్‌ టుడే ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఆశిష్‌ హీరోగా ఇటీవల ఓ కొత్త చిత్రం పట్టాలెక్కింది.

చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్‌ పోస్ట్‌ చూశారా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)