Breaking News

దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్‌ కోసం తంటాలు!

Published on Thu, 05/04/2023 - 08:49

ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే బాలీవుడ్‌ మాత్రం అపజయాలతో సతమతమవుతోంది. ఇటీవల షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణే జంటగా నటించిన పఠాన్‌ చిత్రం సంచలన విజయం సాధించింది. వరుస అపజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు ఊపిరి పోసిందనుకుంటే ఆ తరువాత మళ్లీ పరిస్థితి షరా మామూలుగానే మారింది. 

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్లుగా పేరున్న వారంతా తమ గోల్‌ బాలీవుడ్‌గానే భావిస్తున్నారు. ఇంతకు ముందు నటి శ్రీదేవి, జయప్రద వంటి వారు బాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యారు. అదే బాటలో ఇప్పుడు నటి రష్మిక మందన్నా, రాశీఖన్నా, పూజాహెగ్డే వంటి వారు బాలీవుడ్‌ పిలుపుతో అక్కడికి పరుగు పెడుతున్నారు. అయితే వీరి పరిస్థితి రివర్స్‌ గేర్‌ను తలపిస్తోంది.

(ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ)

అక్కడ వీరంతా ఒక్క హిట్‌ కోసం ఆరాటపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తోంది. నటి రాశీఖన్నా బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించింది. అదే విధంగా నటి పూజాహెగ్డే ఇటీవల నటించిన చిత్రాలన్నీ వరుసగా అపజయం పాలవుతున్నాయి. నటి రష్మిక మందన్నా విషయానికి వస్తే అక్కడ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరిచింది. 

ఈ తరువాత అక్షయ్‌కుమార్‌తో జత కట్టిన చిత్రం ప్లాప్‌ అయ్యింది. ఇలా వరుసగా రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడం రష్మిక కెరీర్‌కు దెబ్బ తీసిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న యానిమల్‌ చిత్రం పైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరిన్ని అవకాశాల కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకున్నట్లుంది. 

స్పెషల్‌ ఫొటో సెషన్లతో రకరకాల ఫొటోలను తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అలా ఇక్కడ టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న నటీమణులు బాలీవుడ్‌ అచ్చిరావడం లేదనే ప్రచారం జోరుందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ సరసన పుష్ప– 2, నితిన్‌తో ఓ చిత్రం చేస్తోంది.

(ఇది చదవండి: స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)