Breaking News

'నా సామిరంగ'.. దెబ్బకు టికెట్స్ క్యాన్సిల్ చేశా: నాగార్జున కామెంట్స్ వైరల్!

Published on Sun, 01/14/2024 - 10:41

ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' అంటూ వచ్చేశాడు కింగ్ నాగార్జున. నాగార్జున, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు.  పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కింగ్ నాగార్జున్ మాల్దీవుస్‌ అంశంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం. కాగా.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్  చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున)

నాగార్జున మాట్లాడుతూ..'అటు బిగ్‌బాస్‌తో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా 75 రోజుల పాటు షూటింగ్‌తో ఉన్నా. ఫెస్టివల్‌ తర్వాత 17,18 తేదీల్లో మాల్దీవుస్‌ వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్. కానీ మన ప్రధాని మోదీపై వాళ్లు చేసిన కామెంట్స్‌ను చూసి నేను టికెట్స్ క్యాన్సిల్‌ చేశా. అంతే కానీ.. నేను భయంతో టికెట్స్‌ రద్దు చేసుకోలేదు. వాళ్లు చేసింది కరెక్ట్ కాదు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు లీడర్‌గా ఉన్నా మన ప్రధాని పట్ల వారు వ్యవహరించిన తీరు సరైంది కాదు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మన ఇప్పటి నుంచి లక్షద్వీప్‌లోని బంగారం ఐల్యాండ్స్‌కు వెళ్దాం' అంటూ నవ్వుతూ అన్నారు.  కాగా.. నా సామిరంగ అల్లరి నరేశ్, రాజ్‌ తరుణ్, మిర్నా మీనన్‌ , రుక్సార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతమందించారు. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)