ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
పాటల రచయిత గురుచరణ్ మృతి
Published on Fri, 09/13/2024 - 00:56
ప్రముఖ పాటల రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. దివంగత దర్శకుడు మానాపురం అప్పారావు, దివంగత నటి ఎం.ఆర్. తిలకంల కుమారుడే గురుచరణ్. ఎంఏ చదివిన ఆయన ప్రముఖ పాటల రచయిత ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు.
‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’ (అల్లుడుగారు), ‘కుంతీకుమారి తన నోరుజారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ (రౌడీగారి పెళ్ళాం) వంటి దాదాపు 200లకుపైగా సూపర్ హిట్ పాటలను రచించారు గురుచరణ్. ముఖ్యంగా నటుడు మోహన్బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత ఆయన. అందుకే తన చిత్రాల్లో కనీసం ఒక్క పాట అయినా తప్పకుండా గురుచరణ్తో రాయించేవారు మోహన్బాబు. చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Tags : 1