Breaking News

మెగాస్టార్‌కు సమస్యను వివరించిన నిర్మాతలు.. చిరు ఏమన్నారంటే?

Published on Tue, 08/05/2025 - 18:30

టాలీవుడ్‌ నిర్మాతలు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ సభ్యులంతా కలిసి ప్రస్తుతం టాలీవుడ్‌లో తలెత్తిన సమస్యను ఆయనకు వివరించారు. ఫిల్మ్ వర్కర్స్‌ ఫెడరేషన్ ప్రతినిధులంతా కలిసి షూటింగ్స్ ఆకస్మాత్తుగా ఆపడం సరికాదని చిరుకు వివరించారు. నిర్మాతల వర్షన్‌ విన్న మెగాస్టార్‌.. సినీ కార్మికుల ఫెడరేషన్‌ వాదనలు కూడా తెలుసుకుని మాట్లాడాతానని చెప్పారని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు.  ఈ సమావేశంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులైన అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ పాల్గొన్నారు.

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ..' నిర్మాతలం అందరం చిరంజీవిని కలిసి మా సమస్యను వివరించాం. ఫిల్మ్ వర్కర్స్‌ ఫెడరేషన్ ప్రతినిధులంతా కలిసి షూటింగ్స్ సడన్‌గా ఆపడం భావ్యం కాదని చెప్పాం. అటు వైపు కార్మికుల వర్షన్ కూడా తెలుసుకుంటానని చిరంజీవి మాతో చెప్పారు. రెండు, మూడు రోజులు చూస్తాను. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోతే నేను జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇ‍చ్చారు.' అని అన్నారు.

కాగా.. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్-2022లో చివరిసారిగా వేతనాలు సవరించారు. మూడేళ్ల వ్యవధిలో 30 శాతం వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు.. ఈ పెంపును అంగీకరించడానికి నిరాకరించారు. దీంతో టాలీవుడ్‌లో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)