Breaking News

సమ్మెలో సినీ కార్మికులు.. నిర్మాతల నుంచి 4 షరతులు

Published on Fri, 08/08/2025 - 09:16

చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించడం లేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల  మధ్య చర్చలకు నేడు (ఆగష్టు 8) విరామం ఇచ్చారు. నాలుగురోజుల నుంచి వారు సమ్మెలో ఉండటంతో  టాలీవుడ్‌ షూటింగ్స్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలలు 4 ప్రతిపాదనలు ఉంచారు. వాటికి అంగీకారం తెలిపితే వారు కోరిని 30 శాతం జీతం పెంపు అనే అంశంపై ఒక క్లారిటీ రావచ్చు. జీతాల పెంపు అంశంపై మంత్రి కోమటి రెడ్డి , చిరంజీవిని కలుస్తామని  ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శనివారం జరగబోయే చర్చలు సానుకూలంగా రాణి పక్షంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ కార్మికులు చెప్పుకొస్తున్నారు.

నిర్మాతల 4 ప్రతిపాదనలు ఇవే

  • కార్మికులు ఖచ్చితమైన  కాల్ షీట్లు ఇవ్వాలి. పని గంటల విషయంలో (6Am to 6Pm, 9Am to 9Pm ) ఏదొ ఒక షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి

  • ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో   కూడా వర్క్ చేయించుకుంటాం (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)

  • షూటింగ్ ఎక్కడ జరిగినా హాజరు కావాలి. దూరం అనే అంశాన్ని తీసుకురావద్దు. 

  • ప్రతి నెల రెండో ఆదివారం,  పండుగ రోజు (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో పనిచేసిన వారికి మాత్రమే డబుల్  కాల్ షీట్ .. మిగిలిన ఆదివారాల్లో  సింగిల్ కాల్షీట్‌‌ ఉంటుంది.

కార్మికుల నుంచి ప్రధానంగా 2 ప్రతిపాదనలు

  •  30 పర్సెంట్ వేతనాలు పెంచాలి 

  • పెంచిన వేతనాలను ఏరోజుకారోజు  చెల్లించాలి

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)