Breaking News

చెన్నైలో దేవీశ్రీప్రసాద్‌ కామెంట్స్‌.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత

Published on Wed, 11/27/2024 - 12:57

ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్‌లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో కిస్సిక్‌ సాంగ్‌ విడుదల చేశారు.

అయితే ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.

అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ స్పందించారు. నితిన్ రాబిన్‌హుడ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు ‍అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్‌ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)