Breaking News

వారికి అసలు మానవత్వం లేదా?: మహేశ్ బాబు పోస్ట్ వైరల్!

Published on Tue, 02/27/2024 - 21:35

కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్‌ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్‌లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్‌ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. 

కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్‌ పోచర్‌. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, క్రైమ్‌ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు.  పోచర్‌లో నిమేషా సజయన్‌, రోషన్‌ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్‌నే సిరీస్‌గా రూపొందించారు. ఈ సిరీస్‌కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)