Breaking News

రైటర్ ‍పద్మభూషణ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు.. ఏడ్చేసిన సుహాస్

Published on Mon, 02/06/2023 - 15:54

సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.  చిన్న సినిమా అయినా మంచి కంటెంట్‌తో పాటు చక్కని సందేశం ఉండడంతో ఈ సినిమాకు స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని.. సుహాస్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.  అలాగే దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిని కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.  


మహేష్ బాబు ట్వీట్‌లో రాస్తూ.. ’రైటర్ పద్మభూషణ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా. హార్ట్ టచింగ్‌గా ఉంది.  ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది. కుటుంబంతో కలిసి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో సుహాస్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ అండ్ టీమ్ అందరికీ అభినందనలు.' అంటూ  పోస్ట్ చేశారు ప్రిన్స్. అలాగే హీరో సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఏడ్చేసిన సుహాస్

రైటర్ పద్మభూషణ్‌పై మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడంతో హీరో సుహాన్ భావోద్వేగాలను ఆపుకోలేక పోయాడు. ఈ ఆనందకర క్షణాలను తట్టుకోలేక ఏడ్చేశాడు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుహాస్. 

Videos

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

Photos

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)