Breaking News

టాలీవుడ్ సూపర్‌ 'హిట్‌' సిరీస్‌.. పార్ట్‌-3లో హీరో ఎవరంటే?

Published on Thu, 09/05/2024 - 11:30

సరిపోదా శనివారం అంటూ ఇటీవలే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ హీరో నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అంతలోనే మరో కొత్త మూవీని ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్‌లో 32వ చిత్రంగా నిలవనుంది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేయండి.

గతంలో టాలీవుడ్‌లో హిట్‌ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ పేరుతో వచ్చిన మూవీలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్‌-2లో లీడ్‌ రోల్‌లో అడివి శేష్‌ కనిపించారు. ఈ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రం హిట్‌-3. ఇందులో టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్.

కాగా.. ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)