Breaking News

కంగువా బీజీఎంపై విమర్శలు.. దేవీశ్రీ ప్రసాద్ రియాక్షన్‌!

Published on Fri, 01/17/2025 - 21:07

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది

అయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్‌లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్‌పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.

దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్‌ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్‌ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి.  కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్‌లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.

ఆస్కార్ బరిలో కంగువా..
‍
అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?