Breaking News

హెబ్బా పటేల్ థాంక్యూ డియర్‌ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published on Fri, 08/01/2025 - 19:44

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

థాంక్యూ డియర్ కథేంటంటే..

సత్య(ధనుష్‌ రఘుముద్రి) సినిమా డైరెక్టర్‌ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.

ఎలా ఉందంటే..

ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు ఈ మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.

దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ తాను అనుకున్న సందేశమిచ్చాడు.

ఎవరెలా చేశారంటే..

హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్‌లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్‌ హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్‌లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)