Breaking News

సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంఫోర్‌ఎం.. ఫస్ట్‌ రోజే లక్ష గెలిచే ఛాన్స్‌!

Published on Mon, 12/02/2024 - 13:07

జో శర్మ,  సంబీత్ ఆచార్య జంటగా నటిస్తోన్న చిత్రం 'ఎంఫోర్ఎం'. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కత్వం వహించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు డైరెక్టర్ తెలిపారు.  సినీ చరిత్రలో ఇప్పటివరకు రానీ కాన్సెప్టుతో ఈ సినిమా చేసిన‌ట్లు వెల్లడించారు. రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కముందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ మాట్లాడుతూ.. 'ఇటీవ‌ల హిందీ ట్రైలర్ గోవా ఫిలిం ఫెస్టివల్‌లో విడుద‌ల చేశాం. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. మా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. హీరోయిన్ జో శర్మ త‌న ఫ‌ర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించాం. క‌థ‌, క‌థ‌నాల‌ను న‌మ్ముకునే సినిమా తీశాం. ఈ సినిమా విడుద‌లైన‌ ఫ‌స్ట్ డే  చూసి ఇందులో కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు.

కాగా.. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, ఎంఆర్సీ వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వసంత్ సంగీతమందిస్తున్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)