Breaking News

టాలీవుడ్‌లో తొలిసారి అలాంటి కాన్సెప్ట్‌... బాక్సాఫీస్ షేక్ చేస్తారా!

Published on Wed, 07/03/2024 - 22:15

సాయికుమార్‌, అనసూయ భరద్వాజ్‌, శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం అరి. ఈ మూవీని పూర్తి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. పేపర్‌ బాయ్‌ ఫేం జయశంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు‌ మంచి ఆదరణ లభించింది.

అయితే ఇటీవల టాలీవుడ్‌ మైథలాజికల్‌ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రిలీజైన కల్కి 2898 ఏడీ సైతం అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్, ఓ మై గాడ్, కల్కి సినిమాలు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తెరెకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధి కలెక్షన్లు రాబట్టాయి. అరి కూడా ఈ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల సరసన నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే.

అరిషడ్‌వర్గాస్‌ కాన్సెప్ట్‌..

అరి మూవీలో అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులను పరిచయం చేయనున్నారు. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న తొలి చిత్రంగా అరి నిలవనుంది.
అయితే బాలీవుడ్‌లో అభిషేక్‌ బచ్చన్‌ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)