Breaking News

పెళ్లి చేసుకుందామంటూ ఇంటికి పిలిచి నిండా ముంచేసిన మహిళా నిర్మాత

Published on Thu, 02/08/2024 - 08:38

గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి దండుకుంది. తీరా ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటపడడంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసిన ఓ సినిమా షూటింగ్‌లో మహిళా నిర్మాత అతనికి పరిచయం అయ్యింది.

సినిమా షూటింగ్‌ పూర్తయిన అనంతరం సదరు మహిళా నిర్మాత అతనికి ఫోన్‌ చేసి డిన్నర్‌ చేసేందుకు ఇంటికి రావాల్సిందిగా చెప్పింది.ఆ సమయంలో భర్తకు విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకుందామని సదరు మహిళ నాగార్జున బాబుకు చెప్పింది. దీనికి కూడా అతను ఒప్పుకోవడంతో ఇరువురూ చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతని నుంచి రూ. 18,50,000లను నేరుగా, మరో రూ. 10 లక్షలను ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లోకి వేయించుకుంది.

అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జునబాబు విచారించగా అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. కానీ తనకు ఒక వివాహం అయ్యిందని, పిల్లలు లేరని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసిందని గ్రహించాడు. అలాగే గతంలో ఆమె పలువురిపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్‌ గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో భరత్‌ అనే వ్యక్తిపై, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తిపై, నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. తనను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నాగార్జున జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)