Breaking News

రూ.1000 కోట్ల కల.. డిసెంబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే!

Published on Fri, 10/27/2023 - 11:43

ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో  ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది.

(చదవండి: హీరోయిన్‌తో రహస్యంగా లవ్‌..? సిగ్గుపడిపోయిన యంగ్‌ హీరో!)

ఆశలన్నీ సలార్‌పైనే
డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతున్న సలార్‌ మూవీపై టాలీవుడ్‌ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కేజీయఫ్‌ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఒకవేళ హిట్‌ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ ఓ లెక్కనే కాదు. 

(చదవండి: ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ మూవీ రివ్యూ  )

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
సలార్‌ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్‌ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి.  మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో డిసెంబర్‌ 22 తర్వాత తెలుస్తుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)