ది రాజాసాబ్‌ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్‌ నటుడితో తొలిసారి!

Published on Wed, 01/29/2025 - 17:23

గతేడాది తంగలాన్‌తో సూపర్‌ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్‌ లైన్‌లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు మాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్‌ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్‌తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి  జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్‌ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. 
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)