టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?

Published on Fri, 10/18/2024 - 19:31

అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్‌లో వస్తోన్న పొట్టేల్‌ మూవీలో అనన్య లీడ్ రోల్‌లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్‌ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్‌మెంట్‌ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.

(ఇది చదవండి:  అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్‌ వచ్చేసింది!)

దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్‌మెంట్‌ అనేది టాలీవుడ్‌లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్‌ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)