Breaking News

తెలుగు హీరోల వెంటపడుతున్న కన్నడ డైరెక్టర్లు

Published on Sat, 03/25/2023 - 08:19

సినిమా రంగంలో ప్రతిభ ఉంటే చాలు.. భాషాపరమైన హద్దులు బద్దలవుతాయి. టాలెంట్‌ ఉంటే పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు ఆయా హీరోలు, నిర్మాతలు. ఇదే కోవలో తాజాగా ప్రశాంత్‌ నీల్, హర్ష, నార్తన్‌ వంటి కన్నడ దర్శకులు తెలుగు స్టార్‌ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. తెలుగు హీరోలతో ఆ కన్నడ దర్శకులు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

► కన్నడలో ‘ఉగ్రం’ (2014) సినిమాతో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు ప్రశాంత్‌ నీల్‌. ఆ తర్వాత నాలుగేళ్లకు యశ్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ (మొదటి భాగం 2018) మూవీతో కన్నడ ఇండస్ట్రీని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌’ (రెండవ భాగం 2022) చిత్రం కూడా సూపర్‌ హిట్‌ కావడంతో భారీ అవకాశాలు ప్రశాంత్‌ నీల్‌ డోర్‌ని టచ్‌ చేశాయి. అందులో భాగంగా పాన్‌ ఇండియా హీరోగా దూసుకెళుతున్న ప్రభాస్‌తో ‘సలార్‌’ మూవీ చేసే గోల్డెన్‌ చాన్స్‌ అందిపుచ్చుకున్నారు ప్రశాంత్‌. ‘కేజీఎఫ్‌’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో స్టార్‌ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేసే చాన్స్‌ అందుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ‘సలార్‌’ షూటింగ్‌ పూర్తి కాగానే ఎనీ్టఆర్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ని ఆరంభించనున్నారు ప్రశాంత్‌ నీల్‌. కొరటాల శివతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ప్రశాంత్‌ సినిమా షూటింగ్‌లో అడుగుపెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారట ఎన్టీఆర్‌.

► కథా బలం, యాక్షన్‌ సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్‌ ఎ. హర్ష. శివరాజ్‌కుమార్‌తో ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘వేద’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన తెలుగులో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లో 31వ చిత్రమిది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌పై కేకే రాధా మోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 

► రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు చరణ్‌. అదే విధంగా మరో సినిమాని కూడా లైన్‌లో పెట్టారట. ‘ముఫ్తీ’ (2017) సినిమాతో దర్శకుడిగా కన్నడలో ఘనవిజయం అందుకున్న నార్తన్‌తో రామ్‌చరణ్‌ సినిమా చేయనున్నారని టాక్‌. ఇక ‘ముఫ్తీ’ తర్వాత కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌తో నార్తన్‌ తీసిన ‘భైరతి రణగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్‌చరణ్‌కు నార్తన్‌ ఓ కథ వినిపించగా, నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. శంకర్‌తో చేస్తున్న సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాని పూర్తి చేశాక నార్తన్‌ మూవీ చేస్తారట రామ్‌చరణ్‌. ప్రశాంత్‌ నీల్, హర్ష, నార్తన్‌ మాత్రమే కాదు.. మరికొందరు కన్నడ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)