Breaking News

వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. అదిరిపోయిన పోస్టర్ లుక్

Published on Mon, 01/23/2023 - 15:58

టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్‌ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పారు.  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే విశ్వక్‌ సేన్‌ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించిన వెంకటేశ్‌ మరే కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇటీవల హీరో రానాతో కలిసి రానా నాయుడు వెబ్‌ సిరీస్‌లో కనిపించారు. తాజాగా తన నెక్స్ట్‌ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ అడ్వెంచర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశారు. అది కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రానికి 'వెంకీ75' పేరుతో విడుదలైన పోస్టర్ వెంకీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జనవరి 25న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో వెంకటేశ్ నటించిన నారప్ప, ఎఫ్‌-3 చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ప్రీ లుక్ పోస్టర్‌ చూస్తే వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకున్నట్లు కనిపిస్తోంది.  భారీ పేలుడు ముందు నిలబడిన వెంకటేశ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తే ఈ సినిమా యాక్షన్ జోనర్‌ను తలపించేలా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా.. ఇటీవల వెంకటేశ్‌-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)