Breaking News

స్టార్ హీరో కాళ్లు మొక్కిన సందీప్ కిషన్‌!

Published on Mon, 07/22/2024 - 15:52

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రాయన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్‌.. ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు అన్న, గురువు అన్నీ ధనుశ్‌ అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువుకు గురుపౌర్ణమి రోజున ధన్యవాదాలు అంటూ ధనుశ్‌ కాళ్ల మొక్కారు. అయితే ఇద్దరం సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ నంబర్‌ కూడా తన వద్ద లేదని సందీప్ అన్నారు. 

కాగా.. రాయన్‌లో ధనుశ్‌ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు.  సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, కాళిదాస్‌ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)