Breaking News

సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రం.. డైరెక్టర్‌ ఎవరంటే?

Published on Fri, 06/21/2024 - 18:40

గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన  సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్‌ హై యాక్షన్‌ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్‌ టైటిల్ 'ఎస్‌డీటీ 18' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

సాయి ధరమ్ తేజ్‌ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం.  పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో  సాయి దుర్గ తేజ్‌ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్‌లో ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)