'కట్టప్ప బాహుబలిని చంపకపోయుంటే?'.. రానా అదిరిపోయే రిప్లై!

Published on Wed, 07/16/2025 - 20:03

తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన దర్శదధీరుడు రాజమౌళిదే. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు ప్రపంచస్థాయిలో మనసత్తా చాటాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్‌ గెలుపుతో మరోసారి వరల్డ్‌ వైడ్‌గా తెలుగు సినిమా పేరు వినిపించేలా చేసింది. ఇంత ఘనత తీసుకొచ్చిన రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్‌’(Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్‌ చేయబోతున్నారు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని రాజమౌళి ప్రకటించారు. కాగా.. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌తో పాటు రానా కీలక పాత్రలో కనిపించారు.

అయితే  తాజాగా బాహుబలి టీమ్ ప్రశ్నకు హీరో రానా ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగి ఉండేదని ట్విటర్‌ వేదికగా టీమ్ ప్రశ్నించింది. ఇది చూసిన హీరో రానా స్పందించాడు. కట్టప్ప ఆ పని చేయకపోతే.. నేను బాహుబలిని చంపేసేవాడినని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ భళ్లాల దేవ బ్యాక్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)