Breaking News

వివాదంలో తండేల్ సినిమా.. రియల్ హీరో వైఎస్‌ జగన్‌ అంటూ మత్స్యకార నేతల ఆగ్రహం

Published on Fri, 02/07/2025 - 16:37

అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మించి మా మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మండిపడ్డారు. 22 మందిని పాకిస్తాన్ నుంచి తీసుకువస్తే.. ప్రేమకథ సినిమా తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అని కొనియాడారు.

మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా నిర్మించి మా మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీశారు. ⁠ఈ సినిమాలో రియల్ హీరో ఆనాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన ⁠22 మందిని పాకిస్థాన్ జైలు నుంచి తీసుకొని వస్తె.. ప్రేమ కథ సినిమా తీస్తారా..? 22 మంది కుటుంబాలకి ప్రేమ లేదా ఒక్కరికే ప్రేమ ఉంటుందా? ⁠వారిని జైలు నుంచి విడుదల చేయడానికి మత్స్యకార నాయకులు కాళ్లు అరిగేలా తిరిగారు అని' మూవీ మేకర్స్‌ను నిలదీశారు.

తండేల్ కథపై జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా అంతా కల్పితం. దాదాపు 22 మందిని జైల్లో వేశారు. మత్స్యకార నేతలు ఎంతో కష్టపడి వారిని విడిపించారు. అప్పటి సీఎం జగన్ మోహన్‌ రెడ్డినే నిజమైన తండేల్‌ హీరో. ఎక్కడా కూడా ఈ సినిమాలో రియాలిటీ కనిపించలేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను పూర్తిగా వక్రీకరించారు. మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న సెంటిమెంట్స్‌ను బిజినెస్‌గా మార్చుకున్నారు. కేవలం డబ్బు కోసమే ప్రేమకథగా తెరకెక్కించారు. 22 మంది జైలుకు పోతే లవ్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది. 22 మంది జైలుకు వెళ్లితే.. 20 మంది మాత్రమే విడుదలయ్యారు. వీళ్లను విడిపించేందుకు కష్టపడిన మత్స్యకార నేతలు, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరోలు అని' కొనియాడారు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)