Breaking News

'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్

Published on Tue, 03/12/2024 - 18:28

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్‌లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్‌ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)