Breaking News

దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!

Published on Mon, 03/10/2025 - 20:45

కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో  తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.

ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్‌ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.

అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్‌ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్‌ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)