Breaking News

చిరంజీవికి పరిచయం చేస్తానంటే ఒప్పుకోలేదు: యంగ్‌ హీరో

Published on Wed, 03/13/2024 - 15:55

ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి అదిత్‌ అరుణ్‌ (త్రిగుణ్‌). తనకున్న టాలెంట్‌తో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాలు చేసినప్పటికీ ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను చాలా సినిమాలు చేశాను. కానీ ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. నేను చిరంజీవికి వీరాభిమానిని. స్కూల్‌లో ఉన్నప్పుడే ఆయన్ను కలిశాను. మా ఇంట్లో చిరంజీవిది తప్ప ఎవరి ఫోటో ఉండదు. ఆయన కూతురు సుష్మితతో పరిచయముంది. నన్ను చిరుకు పరిచయం చేస్తానంది కానీ నేను ఒప్పుకోలేదు. ఏదో ఒక రోజు నా పేరు తనకు తెలుస్తుంది.. ఆరోజే తనను కలుస్తానని చెప్పాను.

అది జీవితంలో మర్చిపోలేను
నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది.. నేను ఉద్వేగం సినిమా చేశాను (త్వరలో రిలీజవుతుంది). ఆ సినిమా చివరి రోజు షూటింగ్‌... ఉదయం రెడీ అవుతున్నాను, ఇంతలో నాన్న నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. అమ్మ చనిపోయిందని చెప్పాడు. నిర్మాతకు షూటింగ్‌కు రాలేనని ఎలా చెప్పాలా? అని చాలా టెన్షన్‌ పడ్డాను. సినిమాకు డబ్బుల్లేని రోజులు, ఫ్లాప్‌ అయినప్పుడు, సినిమా ఆగిపోయిననాడు.. ఎన్నడూ అంత టెన్షన్‌ పడలేదు. ఆరోజు మాత్రం ఓపక్క కన్నీళ్లు, మరోపక్క చెమటలు పట్టాయి. నిర్మాతకు చెప్తే వెంటనే షూటింగ్‌ క్యాన్సల్‌ చేశాడు.

ఇంటికి రౌడీలను పంపించారు
పా.రంజిత్‌.. అట్టకత్తి సినిమాకు నన్నే హీరో అనుకున్నాడు. కానీ అప్పటికే చేతిలో మరో సినిమా ఒప్పుకోవడంతో అది చేయలేకపోయాను. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్‌ ఫీలవుతుంటాను. రెండేళ్లక్రితం.. కొందరు ఓ సినిమా షూట్‌ చేస్తున్నామని అడ్వాన్స్‌ ఇచ్చి ఫోటోలు తీశారు. తీరా నన్ను పక్కన పెట్టి ఓ హీరో కుమారుడిని పెట్టారు. నాకు కోపమొచ్చి అడ్వాన్స్‌ తిరిగివ్వలేదు. ఇంటికి రౌడీలను పంపించారు. బెదిరించారు.. అయినా బెదరలేదు' అని చెప్పుకొచ్చాడు అదిత్‌ అరుణ్‌.

చదవండి: 58 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన సింగర్‌ తల్లి?

Videos

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం