హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రెండు ప్యానెళ్ల ఆసక్తికర పోటీ
Published on Sun, 12/28/2025 - 07:20
ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జూలై లోనే ముగిసిన పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికయ్యే నూతన కార్యవర్గం జూలై 2027 పదవుల్లో వరకు కొనసాగుతారు.
అధ్యక్ష పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు.. మన ప్యానెల్ నుంచి నట్టి కుమార్ పోటీ పడుతున్నారు. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానల్‌గా.. అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానల్‌గా పోటీ చేస్తున్నారు. మన ప్యానల్‌ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్‌ను అల్లు అరవింద్, దిల్ రాజు , సురేష్ బాబు బలపరుస్తున్నారు.
గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారని చిన్న నిర్మాతల మన ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలని బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యుల వాదిస్తున్నారు.
Tags : 1
